టాలీవుడ్ ఐక్యతగా లేదా ?

గత వారం రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న హడావుడి గురించి తెలిసిందే. ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిల్మ్ ఛాంబర్ రెండు చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ బాడీ నిర్మాణాలు బంద్ చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు బాహాటంగానే ప్రకటనలు వెలువడుతున్నాయి. అయితే ఆగస్టు 1 నుంచి షూటింగ్ లు బంద్ అని ప్రకటనలు వచ్చేశాయి. అంతేకాదు.. ఓటీటీలపై ఆంక్షలు విధించారు. థియేటర్ లో విడుదలైన సినిమా 10 వారాల తర్వతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించారు.
గత వారం రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న హడావుడిలో సురేష్ బాబు పేరు ఎక్కడా వినిపించడం లేదు. సురేష్ బాబు వ్యాపార భాగస్వామి, సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార భాగస్వామి అయిన ఆసియన్ సునీల్ పేరు కూడా ఎక్కడా ఏ కమిటీలో కనిపించకపోవడం. దీంతో టాలీవుడ్ లో ఐక్యత లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చలు, తీసుకున్న నిర్ణయాలు ప్రాక్టీకల్ గా వర్కవుట్ కావనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.