గూగుల్ స్ట్రీట్‌వ్యూలో హైదరాబాద్ గల్లీ గల్లీ
అభివృద్ధి చెందిన దేశాల్లోగూగుల్ స్ట్రీట్‌వ్యూ ఇప్పటికే అందుబాటులో ఉంది. గూగుల్ స్ట్రీట్‌వ్యూలో రహదారితోపాటు అక్కడున్న ఇళ్లు.. చిన్నచిన్న వీధులు.. 360 డిగ్రీల కోణంలో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించడంతో రెండ్రుల క్రితం నుంచి గూగుల్ స్ట్రీట్‌వ్యూ హైదరాబాద్ లోనూ అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్ అవుటర్ రింగురోడ్డు లోపలి కాలనీలు, వీధులు, ప్రధాన మార్గాల వెంబడి నిర్మాణాలన్నీ స్ట్రీట్‌వ్యూలో నిక్షిప్తమయ్యాయి. పాతబస్తీలోని చిన్నచిన్న గల్లీలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనా వీధిలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడికి కార్లు, ఆటోలు వెళ్లే మార్గం ఉందో లేదో ముందుగానే చూసుకోవచ్చు. ఇళ్లు అద్దెకు తీసుకునే వ్యక్తులు, స్థిరాస్తి కొనుగోలుదారులు ఆ ప్రాంత ముఖచిత్రాన్ని ముందుగానే చూసి అంచనా వేసుకోవచ్చు.