బురదలో ఇరుక్కున్న విమానం టైరు

టీవల కొంతకాలంగా పలు విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్పైస్‌జెట్, ఇండిగో విమానాల్లో ఈ లోపాలు ఎక్కువగా బయటపడ్డాయి. తాజాగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదవశాత్తూ రన్‌వే నుంచి జారి.. విమానం టైరు బురదలో చిక్కుకుపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

అస్సాంలోని జోర్హత్ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతుండగా రన్‌వే పై నుంచి జారింది. రెండు టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు.