మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు… కాంగ్రెస్ చేతుల్లో !
తెలంగాణలో మరో ఉప రావడం దాదాపు ఖాయమైంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. తద్వారా వచ్చే మునుగోడు ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ ఇప్పటి నుంచే పని ప్రారంభించింది.
టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నేతలు అరడజను వరకు ఉన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులు పోటీ పడుతున్నారు. మునుగోడులో ప్రధాన పోటీ బీజేపీ-టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది అంటున్నారు. కానీ కాంగ్రెస్ కు క్యాడర్ ఉంది. రాజగోపాల్ రెడ్డి వెంటే పోయి కాంగ్రెస్ కార్యర్తలు చాలా తక్కువ. వారిని టీఆర్ఎస్ దగ్గర చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అవి ఫలిస్తే.. ఆ పార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపడవచ్చు. రాజగోపాల్ రెడ్డికి సొంత ఇమేజ్ తప్ప. మునుగోడులో బీజేపీకి క్యాడర్ లేదు. కాంగ్రెస్ కార్యకర్తలనే కమలం కార్యకర్తలుగా మార్చే పనిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కానీ వంద శాంతం సక్సెస్ అయ్యేలా కనిపించడం లేదు.
మరోవైపు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మీద పోటీకి అన్న వెంకట్ రెడ్డి దిగుతారనే ప్రచారం జరుగుతుంది. ఇది దాదాపు అవ్వకపోవచ్చు. ఒకవేళ మరో బలమైన నేతను బరిలోకి దింపితే.. అది బీజేపీ విజయావకాశాలను బాగా తగ్గించే ఛాన్స్ ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల గెలుపు కోసం కాంగ్రెస్ తోడ్పడింది. అయితే ఇప్పుడు మునుగోడులోనూ అదే పని చేయకపోవచ్చు. ఎందుకంటే ? టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకోవడానికి ఈ ఉప ఎన్నికలో గెలుపు అత్యంత కీలకం. అందుకే ఈ సారి కాంగ్రెస్ గెలుపు కోసం శాయశక్తుల ప్రయత్నాలు చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే మునుగోడులో టీఆర్ ఎస్ గెలుపు కాంగ్రెస్ చేతుల్లో ఉంది. ఆ పార్టీ ఏ మాత్రం పోటీ ఇచ్చిన కారు పార్టీ గెలుపు ఖాయం కానుందని చెబుతున్నారు.