గ‌న్ లైసెన్స్ కు అప్లై చేసిన సల్మాన్.. ఎందుకంటే ?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అల‌ర్ట్ అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. త‌ను ప్ర‌యాణించే కార్ల‌ను బుల్లెట్ ప్రూఫ్ గా మార్చుకున్నాడ‌ట. అలాగే వ్య‌క్తిగ‌త గ‌న్ లైసెన్స్ విష‌యంలో కూడా స‌ల్మాన్ ఖాన్ అప్లై చేసుకున్నాడ‌ట‌. త‌నకు ఆత్మ‌ర‌క్ష‌ణ నిమిత్తం గ‌న్ కావాలంటూ లైసెన్స్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడ‌ట‌.

పంజాబీ సింగ‌ర్ సిద్ధూ మూసేవాలా దారుణ హ‌త్య త‌ర్వాత బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు కూడా ఆ త‌ర‌హా హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. స‌ల్మాన్ ఖాన్ ను చంపడం త‌న‌కు ల‌క్ష్య‌మంటూ లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ స్ట‌ర్ ప్ర‌క‌టించుకున్నాడు. న‌ల్ల‌జింక‌ల‌ను వేటాడిన కేసులో నిందితుడు అయిన స‌ల్మాన్ ను చంపి ప‌గ తీర్చుకుంటానంటూ ఆ జింక‌ల‌ను ఆరాధించే బిష్ణోయ్ తెగ‌కు చెందిన లారెన్స్ బిష్టోయ్ ప్ర‌క‌టించుకున్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది.