బాలరాజు బోడి.. మేకింగ్ చూశారా ?

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్ఢా’. అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించారు. కరీనా కపూర్‌ కథానాయిక. హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమాలో చైతన్య కీలక పాత్రలో నటించారు. బాలరాజు బోడి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. 

అందులో చైతూ విభిన్నమైన లుక్స్‌లో కనిపించారు. ఈ పాత్ర కోసం తొలుత బాలకృష్ణ, బలరాం.. ఇలా రకరకాల పేర్లు అనుకున్నామని.. ఆఖరికి బాలరాజు బోడి అనే పేరు ఫిక్సయ్యామని నాగచైతన్య తెలిపారు. అంతేకాదు.. చైతూ లుక్ కోసం నాగేశ్వర రావు సినిమాలోని ఓ లుక్ ని రిఫరెన్స్ గా తీసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఆగస్టు 11న లాల్ సింగ్ చడ్డా ప్రేక్షకుల ముందుకు రానుంది.