తారక్ ఫ్యామిలీ టైమ్.. ఇదే తొలిసారి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాను చాలా తక్కువగా వినియోగిస్తుంటారు. ఎక్కువగా సినిమా విషయాలే తప్ప. పర్సనల్, ఫ్యామిలీ విషయాలు ఎక్కువగా షేర్ చేయరు. అప్పుడప్పుడు తనయులతో దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకుంటారు. భార్య ప్రణతి దిగిన పిక్స్ షేర్ చేయడం చాలా అరదు. అలాంటి తారక్.. సోమవారం.. శ్రీమతితో కలిసి కాఫీ టైమ్ ఎంజాయ్ చేశారు. అది కూడా ఓ ఫామ్ హౌస్ లో.
ప్రకృతి అందాల మధ్య ఈ జంట ముచ్చటిస్తూ.. కాఫీని ఎంజాయ్ చేస్తున్న పిక్ ను తారక్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఇలాంటి క్షణాలే కదా కావాల్సింది అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫొటోకు క్యాప్షన్ ఉంచాడు. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే ఈ ఫొటో వైరల్ అయింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు తారక్ రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది.