మాళవిక కవ్వింపు

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ పర్ ఫెక్ట్ ఫిగర్. గ్లామర్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని కొలతలు ఆమె సొంతం. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి. చేసిన ఏడు సినిమాలతో నాలుగు బాషలను కవర్ చేసింది. మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ బాషల్లో నటించింది. విజయ్, దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. సీనియర్ సూపర్ స్టార్స్ స్టార్ రజనీకాంత్, మమ్ముట్టి సినిమాల్లో నటించింది.

ఈ ఫ్లో చూస్తే.. ఇప్పటికే మాళవిక స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవాలి. కానీ అది జరగలేదు. ఎందుకంటే ? చేసిన సినిమాలు హిట్ కాలేదు. అయినా నిరాశ పడకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మాళవిక స్టార్ హీరోయిన్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా వైట్ స్లిట్ డ్రెస్ లో కవ్వించింది. ప్రస్తుతం మాళవిక బాలీవుడ్ సినిమా ‘యుద్ర’లో నటిస్తుంది.