సన్నీ లియోన్ వెరైటీ భంగిమ

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తన ఇమేజ్ కి పూర్తిగా భిన్నంగా కనిపించింది. వెరైటీ భంగిమలో కాస్త సీరియస్ లో లుక్ లో కనిపిస్తున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది హాట్ బ్యూటీ. దానికి ‘క్యూట్’ అంటూ కామెంట్ పెట్టింది. అంతకుముందు మంచు విష్ణుతో కలిసి మరోసారి చిలిపి పని చేసిన సంగతి తెలిసిందే. ఆ స్విమ్మింగ్ పూల్ వీడియో ట్రెండింగ్ లో ఉండగానే.. ఇలా హాట్ బ్యూటీ.. క్యూట్ కామెంట్ తో ఆకట్టుకుంది.

2012లో వచ్చిన ‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీ లియోన్. జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్2, ఏక్ పహెలే లీలా, వన్ నైట్ స్టాండ్.. తదితర సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో ‘కరెంట్ తీగ’  గరుడ వేగ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మంచు విష్ణు సినిమాలో సన్నీ కీలక పాత్రలో నటిస్తోంది.