నటుడు అదుర్స్ రఘు ఇంట విషాదం

హాస్య నటుడు అదుర్స్ రఘుకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి వెంకట్రావ్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
1947 జూన్ 10న జన్మించిన వెంకట్రావ్ ఆర్మీ అధికారిగా సేవలందించారు. రిటైర్మెంట్ అనంతరం ఇంటికే పరిమితమయ్యారు. వెంకట్రావ్ మృతి పట్ల ఆయన బంధువులు, స్నేహితులు, పలువురు సినీ నటులు సంతాపం ప్రకటించారు.