మణిరత్నం-ఎన్టీఆర్-ఎఆర్ రెహమాన్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఓ వైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన మార్క్ చాటుకుంటోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ తో ఆకట్టుకుంటోంది. టీవీ షో, స్పెషల్ ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది.

తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రొమాన్స్ చేయాలని ఉందని చెప్పిన ముద్దుగుమ్మ.. ఆ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అయితే ఇంకా బాగుంటుందని చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించనున్న సినిమా కోసం మొదట జాన్వీ పేరే వినిపించింది. ఆ తర్వాత అలియా భట్ ను ఖరారు చేసింది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో సినిమా నుంచి తప్పుకుంది. మరీ.. ఆమె స్థానంలో జాన్వీని తీసుకుంటారేమో చూడాలి.