#NBK107 టైటిల్ అనౌన్స్ ఎప్పుడంటే ?

నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు పెద్ద టాస్కే ఇచ్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ తర్వాత గోపీచంద్, ‘అఖండ’ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఇది. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేలా యాక్షన్ ఎంటర్ టైనర్ ని రెడీ చేస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, సెట్ నుంచి లీకైన ఫోటోలు ఆకట్టుకున్నాయి. అంచనాలు పెంచాయి.

త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని ప్రకటించబోతున్నారు. అయితే ప్రచారంలో చాలా పేర్లు ఉన్నాయి. జై బాలయ్య, రామారావు, అన్నగారు, రెడ్డిగారు.. తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో #NBK107 టైటిల్ ని గెస్ చేయమని మైత్రీ మూవీస్ అభిమానులకు ఓ టాస్క్ ఇచ్చింది. అయితే అందరూ ‘జై బాలయ్య’ కు జై కొడుతున్నారు. ఇక ఈ నెల 11న ఈ సినిమా టైటిల్ ని ప్రకటించబోతున్నారని తెలిసింది.