రకుల్.. రెడ్ హాట్

టైమింగ్ తెలిసిన హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్. ఎప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ ఎవరిని బుట్టలో వేసుకోవాలి ? అన్నది ఈ ముద్దుగుమ్మకు బాగా తెలుసు. అందుకే జెట్ స్పీడుతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్, కోలీవుడ్ ను ఏలింది. ప్రస్తుతం బాలీవుడ్ లో హవా చూపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఏకంగా ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ఆరు హిందీ సినిమాలు, రెండు తమిళ్, ఒక తెలుగు సినిమా ఉన్నాయి. ‘Thank God’ తప్ప హిందీ సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. థియేటర్స్ లోకి క్యూ కడుతున్నాయి.

ఇప్పటికే అటాక్, రన్ వే 34 ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో ఆడలేదు. రెండు పోయిన మరో నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయనే ధీమాతో రకుల్ ఉంది. ఇక తెలుగు, తమిళ్ ద్విబాషా చిత్రం ’31 అక్టోబర్ లేడీస్ నైట్’ షూటింగ్ దశలో ఉండగా.. అయాలన్ (తమిళ్) షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. సైన్ చేసిన సినిమాలన్నీ దాదాపు పూర్తి కావడంతో రకుల్ కు ఫ్రీ టైమ్ దొరికింది. ఈ ఖాళీ టైమ్ లో అందంగా ముస్తాబై స్పెషల్ ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో తన అందాల ఘాటు రుచి చూపించింది.