ఆఫత్.. కెమిస్ట్రీ అదిరింది

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్. ఈ నెల 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో  జోరు చూపిస్తోంది చిత్రబృందం. గురువారం ‘ఆఫత్..’ సాంగ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ నేడు రిలీజ్ కానుంది.

ప్రోమోలో విజయ్ – అనన్యల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. పూరి జగన్నాథ్ తో కలిసి కరణ్ జోహార్ నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కు దక్కుతున్న క్రేజ్ ను చూసి.. సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.