లైగర్ రొమాంటిక్ సాంగ్.. వచ్చేసింది !

‘లైగర్‌’ నుంచి మరో పాట వచ్చేసింది. ఈ పాట ఫుల్‌ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘‘మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’’గా విజయ్‌ అభివర్ణించారు. ‘‘బాబోయ్‌ మామూలు డ్రామాలు కావు. అన్నీ లెక్కలేసుకుని నువ్వు బకరా అని ఫిక్స్‌ అయినక నంబర్‌ ఇస్తయ్‌. ఇక, వాట్సాప్‌లు షురూ ఐతై చూడు.. నిద్రపోనివవ్వు.. పనులు చేసుకోనివవ్వు.. బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే” అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌లతో మొదలైన ఈ పాటలో విజయ్‌ దేవరకొండ-అనన్యపాండేల కెమిస్ట్రీ అదిరింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్‌ ముంబయి మురికివాడకు చెందిన చాయ్‌వాలాగా కనిపించనున్నారు. ఆయనకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం. పూరి కనెక్ట్స్ తో కలిసి కరణ్ జోహార్ నిర్మించారు. ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

#AAFAT 💞 ▶️ https://t.co/J7FQYeurbc#LIGER #LigerOnAug25th pic.twitter.com/WoUAdmsILQ— OTTRelease (@ott_release) August 6, 2022