‘బింబిసార’ ఫస్ట్ డే లెక్కెంత ?

వ‌శిష్ట్ మ‌ల్లిడి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరో తెరకెక్కిన సినిమా బింబిసార. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హిస్టారిక‌ల్ పాయింట్‌కు టైమ్ ట్రావెల్‌, ఫాంట‌సీ అంశాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు కథ చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు విజువ‌ల్స్‌, మ్యూజిక్ బాగుండటంతో.. బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలిరోజు కలెక్షన్స్ అదిరిపోయాయి.

 బింబిసార తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.3 కోట్ల షేర్‌ను సాధించిన‌ట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో.. మొద‌టిరోజే 50 శాతం రిక‌వ‌రీ వచ్చినట్టు తెలుస్తోంది. నైజాంలో ఈ సినిమా తొలి రోజు 2.15 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఉత్తరాంధ్రాలో 90 లక్షలు, సీడెడ్ లో కోటి 29 లక్షల వసూళ్లు రాబట్టింది. శుక్రవారం రోజు బింబిసారకు ఈస్ట్ 43 లక్షలు, వెస్ట్ లో 36 లక్షలు, కృష్ణ 34 లక్షలు, నెల్లూరు 26, గుంటూర్ 57 లక్షల ఓపెనింగ్స్ వచ్చాయి. మొత్తంగా తెలంగాణ, ఏపీలో తొలిరోజు రూ. 9.30 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమా పై మొదటి నుంచి యంగ్ టైగర్ ఎన్ టీఆర్ నమ్మకంగా ఉన్నారు. అన్న కల్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు. ఇప్పుడు అదే నిజం కావడంతో.. నందమూరి అభిమానులు కాలరెగిరేస్తున్నారు.