హుజూరాబాద్ లో కేసీఆర్ పోటీ
వినడానికి ఇచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఈ లైన్ పై క్లారిటీ రావాలంటే ఇటీవల రాజకీయల్లో జరిగిన కొన్ని సవాళ్లు, హెచ్చరికలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఎలా జరిగినా.. పరిస్థితులు ఏమైనా టీఆర్ఎస్ నుంచి కాలు బయట పెట్టిన తర్వాత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై పై చేయి సాధించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఆయన్ని ఓడించడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అవేంటీ అన్నది ఈ తెలంగాణ సమాజం కళ్లారా చూసింది.
అయితే ఇటీవల కాలంలో ఈటల మరింత దూకుడు పెంచారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సీటుకే ఆయన ఎసరు పెట్టారు. కేసీఆర్ ఓడించడమే తన జీవిత లక్ష్యమని పదే పదే ప్రకటిస్తున్నారు. ఇప్పటికే గజ్వెల్ లో పని మొదలు పెట్టినా.. ఈసారి కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే నిలబడతా ? అంటూ సవాల్ విసురుతున్నారు. ఇది గమనించిన కేసీఆర్.. నువ్వు నన్ను గెలికితే.. నేను నిన్ను గెలుకుతా అన్నట్టుగా.. హుజురాబాద్ లో దిగిపోయారు. ఆయనే స్వయంగా దిగకున్నా.. పాడి కౌశిక్ రెడ్డితో ఫైట్ చేస్తున్నారు. అక్కడ కనబడుతున్నది కౌశిక్ రెడ్డి అయినా.. నడిపిస్తున్నది కేసీఆరే.
బహిరంగ చర్చకు సిద్ధామా ? అంటూ మొదలైన హుజురాబాద్ లొల్లి మూడ్నాలుగు రోజులుగా నడుస్తోంది. తాను వచ్చినా.. ఈటల రాలేదు అంటూ బదనాం చేస్తున్నారు. మరోవైపు ఈటల అవసరం లేదు. కౌశిక్ రెడ్డికి సమాధానం ఇచ్చేందుకు ఈటల పంపించిన మహిళలు చాలని కమలం పార్టీ చెబుతున్నది. ఒకవేళ నిజంగా ఈటల వచ్చినా.. ఆయన్ని వేదిక వరకు రానిచ్చే పరిస్థితి అక్కడ లేదు. పోలీసుల చేత ఆయన్ని అడ్డుకోవడం, అరెస్ట్ చేయించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విషయం పక్కనపెడితే.. దీని వలన కేసీఆర్ కు ఏం లాభం అంటే.. రేపటి రోజున నిజంగానే ఈటల కేసీఆర్ పై పోటీ చేస్తే.. హుజురాబాద్ లో ఓటమి భయంతో.. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఈటల ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఏదో క్రేజ్ కోసం తన మీద పోటీకి దిగిండని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇంత ముందు చూపుతో కేసీఆర్ హుజురాబాద్ లో దిగిండని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆరా.. మజాకా..!