డేంజర్ : ఆ రాష్ట్రాల్లో 10% దాటిన పాజిటివిటీ రేటు

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.  గత కొన్ని రోజలుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏడు రాష్ట్రాలు ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో  క్లీ పాజిటివిటీ రేటు 10శాతం దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌.. ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు.

‘వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఐదంచెల వ్యూహాన్ని తప్పనిసరిగా అమలు చేయండి. అర్హులైన ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయండి. కొవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడండి’ అని భూషణ్‌ లేఖలో సూచించారు. శంలో గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు దాదాపు 20వేలుగా నమోదవుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 19,406 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. 49 మరణాలు చోటుచేసుకున్నాయి