‘హైవే’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడంటే ?

ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా  కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘హైవే’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.  త్వరలోనే  ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆహా అధికారిక ప్రకటన చేసింది. రోడ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన చిత్రమిది. మాన‌స రాధాకృష్ణ‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

దాదాపు నాలుగు కోట్ల‌కు ఆహా సంస్థ ఈ సినిమా డిజ‌ట‌ల్ రైట్స్‌ను కొనుగోలు చేసిన‌ట్లు తెలిసింది. మొన్నటి వరకు థియేటర్స్ లో రిలీజైన సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేది. అయితే ఇటీవల ప్రొడ్యూసర్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ లో రిలీజైన సినిమాను పది వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.