బింబిసార, సీతారామం హిట్.. మెగాస్టార్ ఆనందం !

శుక్రవారం రెండు సినిమాలు బింబిసార, సీతారామం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. మొదటి షోతోనే హిట్ అని తేల్చేశారు ప్రేక్షకులు. వశిష్ట దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార టైమ్ ట్రావెల్ పిరియాడికల్ స్టోరీ, సెట్స్, గ్రాఫిక్స్ లో బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాల రేంజ్ లో భారీతనం లేకున్నా.. కథను నడిపించిన తీరు. దర్శకుడి స్పష్టత  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కళ్యాణ్ రామ్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. తారక్ చెప్పినట్టు కళ్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్ అనిపించుకుంది.

ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో నటించిన సీతారామం అద్భుత ప్రేమకావ్యంగా కితాబు అందుకుంటోంది. ముఖ్యంగా దుల్కర్, మృణాల్ నటన అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. ఫస్టాఫ్ కొద్దిగా స్లోగా సాగినా.. మొత్తంగా సీతారామం చాలా బాగుంది.  ఒకేరోజు రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. సినీ పరిశ్రమలో ఆనందం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి తన హ్యాపీనెస్ ను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.


“ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహానిస్తూ, కంటెంటే బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండు విజయం సాధించడం ఎంతో సంతోషం. ఈ సందర్భంగా సీతారామం మరియు బింబిసార చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మన: పూర్వక శుభాకాంక్షలు” అంటూ ఓ చిన్న పాటి ప్రెస్ నోటును రిలీజ్ చేశారు మెగాస్టార్”

Hearty Congratulations
Team #SitaRamam &
Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr— Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022