మృణాల్ ఠాకూర్ మరో యాంగిల్ చూశారా ?

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ ముచ్చట్లే. ఈ ముంబై భామ ‘సీతారామం’తో తెలుగు పరిచయం అయింది. ఇందులో దుల్కర్ సల్మాన్ రొమాన్స్ చేసింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన సీతారామం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. కథ-కథనం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం అద్భుతంగా ఉన్నాయి. అయితే వీటన్నింటి కంటే దుల్కర్, మృణాల్ నటన కట్టిపడేసింది.

దుల్కర్ కళ్లతోనే నటిస్తే.. మృణాల్ నటన కనుల విందుగా ఉంది. సీత పాత్రకు ఆమె కు నిండితనం తీసుకొచ్చారు. ఇంత ముద్దుగా, క్యూట్ గా భలే ఉంది మృణాల్ అని తెలుగు ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. అయితే ఇది మృణాల్ కి ఒక వైపు మాత్రమే. ఆమె లో మంచి గ్లామర్ హీరోయిన్ కూడా ఉంది. మృణాల్ గురించి పెద్దగా తెలియని వారు.. ఆమె గురించి తెలుసుకొందామని.. నెట్టింట్లో వెతికితే.. ఆమె హాట్నెస్ బయటపడింది. గతంలో బికినీలో హీటెక్కించింది ఈ ముద్దుగుమ్మ. క్లీవేజ్ షో తో అదరగొట్టింది. అంతేకాదు.. మోడ్రన్ డ్రెస్ లో ఆకట్టుకుంది. మొత్తానికి.. తాను ఆల్ రౌండర్ అని చెప్పేస్తోంది. మరీ.. ఆమె అందాలను టాలీవుడ్ ముందు ముందు వాడుకుంటుందేమో చూడాలి.
