కల్యాణ్‌రామ్‌ పై బన్నీ ప్రశంసలు

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. దీంతో నందమూరి అభిమానులు, సినీ పరిశ్రమ కూడా హ్యాపీగా ఫీలవుతోంది. సినీ ప్రముఖుల నుంచి కళ్యాణ్ రామ్ కు అభినందనలు దక్కుతున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బింబిసార హిట్ పై స్పందించారు.

“కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు కల్యాణ్‌రామ్‌ ఎప్పుడూ ముందుంటారు. ‘బింబిసార’.. ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రం. కల్యాణ్‌రామ్‌ నటన ప్రభావితం చేసేలా ఉంది. తొలిప్రయత్నంలోనే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన వశిష్ఠకు, ఇతర సభ్యులు, సాంకేతిక బృందానికి నా హృదయపూర్వక శుభాభినందనలు. కొత్త టాలెంట్‌ని, విభిన్నమైన చిత్రాలను ఇండస్ట్రీకి అందిస్తోన్న కల్యాణ్‌రామ్‌ అంటే నాకెప్పటికీ గౌరవమే” అని బన్నీ అన్నారు.