కామన్వెల్త్‌ : టేబుల్‌ టెన్నిస్‌ లో భారత్ కు స్వర్ణం

కామన్వెల్త్‌ భారత్ పతకాల వేట కొనసాగుతోంది. పారా టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్ 3-5 కేటగిరీలో భవినా పటేల్‌ స్వర్ణం గెలుచుకుంది. గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా.. ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో గెలుపొందింది. దీంతో టీటీ విభాగంలో భారత తరఫున గోల్డ్‌ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

అంతకముందు సోనాల్‌బెన్‌ మనూబాయి పటేల్‌ కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో కామన్వెల్త్‌లో భారత పతకాల సంఖ్య 40కి చేరింది. వీటిలో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి.