నిత్యామేనన్‌ కు ఆరేళ్లుగా వేధింపులు

హీరోయిన్ నిత్యా మీనన్ తనకు ఎదురవుతున్న వేధింపులపై ఓపెన్ అయింది. ఆరేళ్లుగా భరిస్తున్నా… ఇక ఏమాత్రం సహించలేనని.. ఇన్నాళ్లు వేధిస్తున్న యూట్యూబర్ పేరును బయటపెట్టిది. కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే యూట్యూబర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆరోజు నుంచి ఈ వార్తలు వెలువడుతున్నాయి.

అతడి గురించి నిజం చెప్పాలంటే.. దాదాపు ఆరేళ్ల నుంచి నన్నూ, నా కుటుంబాన్నీ వేధిస్తున్నాడు. వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి నాకు ఫోన్లు చేసేవాడు. దాదాపు 30 ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేశా. నా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విసిగించేవాడు. ఇంట్లోవాళ్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్నోసార్లు చెప్పినా.. వదిలేశా. కానీ అతడింకా మారలేదు. నా పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు  చేస్తున్నాడుని ఆవేదన వ్యక్తం చేసింది.