మహారాణి మళ్లీ షురూ

బాలీవుడ్ నటి హుమా ఖురేషి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతుంది. గత ఏడాది బెల్ బాటమ్ సినిమాతో పాటు ‘మహారాణి’ వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడీ.. ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ కూడా రెడీ అయింది. ఆగస్టు 25 నుంచి  సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. 


ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది హుమా. రోజుకో ఫ్యాషన్ తో కెమెరా ముందుకు వస్తోంది. యంగ్ హీరోయిన్స్ ను మైమరిపిస్తోంది. గ్లామర్ పోజులు, ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఇక హుమా ఖురేషి నటిస్తున్న “మౌనిక, ఓ మై డార్లింగ్” షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ‘డబుల్ ఎక్సల్’ షూటింగ్ పూర్తి చేసుకుంది.