మామిడి తోడలో మౌనీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ టాలెంటెడ్. సింగర్, కథక్ డ్యాన్సర్, మోడల్ కూడా. నటిగా మారి టీవీ సీరియల్స్ తో పాపులర్ అయింది. నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడు నటిగా బాలీవుడ్ ను ఏలుతుంది. వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతుంది.

మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో మౌనీ అదరగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మామిడితో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. పచ్చని అందాల మధ్య పరువాలు ఆరబోసింది. మూడ్నాలుగు భంగిమల్లో అందాల విందు చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మౌనీ రాయ్ బ్రహ్మాస్త్ర, #Velle సినిమాల్లో నటిస్తుంది.
