పటాఖా పోరి.. ప్రొఫైల్ చూశారా ?

ఢిల్లీ బ్యూటీ రాధిక మదన్ బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. ‘పటాఖా’ (2018) సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2021 వరకు ఏడాదికో సినిమా చేసింది. అయితే ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తోంది. మౌనీక ఓ మై డార్లింగ్, కుట్టేయ్, సనా, సూరరై పొట్రు రిమేక్ తో పాటుగా హోమీ అదాజానియా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన క్లాస్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. క్లాస్ మాత్రమే కాదు.. మాస్ ప్రేక్షకులను పడగొట్టే సరుకు ఈ ముద్దుగుమ్మ సొంతం. తాజాగా ఫార్మల్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. సూరరై పొట్రు రిమేక్ లో అక్షయ్ కుమార్ కు జంటగా నటిస్తోంది. తమిళ వర్షన్ కు సంబంధించి హీరో, హీరోయిన్ పాత్రల నటనకు గానూ జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.
