TheGrayMan2 అనౌన్స్ చేసిన ధనుష్

కోలీవుడ్ స్టార్ ధనుష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్  #TheGrayMan ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. అనా డి అర్మాస్, ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, వాగ్నోర్ మొయిరా, జెస్సికా హెన్విక్, జూలియా బట్టర్స్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ధనుష్ Avik San పాత్రలో మెరిశారు.

జులై 22 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రస్సో బ్రదర్స్ గత చిత్రాల మాదిరిగా అద్భుతంగా లేదు. రొటీన్ యాక్షన్ సినిమా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే Avik San పాత్రలో ధనుష్ నటన ఆకట్టుకుంది. విలన్ గ్యాంగ్ లో ఓ వ్యక్తిగా ధనుష్ కనిపించారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ను అనౌన్స్ చేశారు ధనుష. త్వరలోనే ది గ్రే మ్యాన్ 2 షురూ కానుంది. ఇందులో Avik San పాత్ర కంటిన్యూ కానుందని తెలిపారు.