సీతారామం.. మలయాళ సినిమాకు కాపీ ?
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. సినిమాలో దుల్కర్ కళ్ళతోనే నటిస్తే.. మృణాల్ ఠాకూర్ చూపులు తిప్పుకోనివ్వలేదు. సీత పాత్రలో అద్భుతంగా నటించింది. దీంతో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. విమర్శకుల ప్రశంశలతో పాటు కమర్షియల్ గా హిట్ అయింది. రెండు రోజుల్లో దాదాపు ఎనిమిది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి క్లీన్ హిట్‌గా సీతారామం నిలిచింది. దీంతో చిత్రబృందం ఆనందానికి అవధుల్లేవు. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా కాపీ అని నెటిజన్లు తేల్చేశారు.
ఈ సినిమాకు మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా నటించిన అనార్కలి స్ఫూర్తి వార్తలు వినిపిస్తున్నాయి. అనార్కలి బేస్ పాయింట్ ను తీసుకొని హను రాఘవపూడి సీతారామం సినిమాను తెరకెక్కించాడంటూ పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అనార్కలిలో హీరో పాకిస్థాన్ వెళ్లి ఓ చిన్నారికి కాపాడే ప్రయత్నంలో అక్కడే శత్రు సైనికులకు చిక్కుకొని తన ప్రియురాలి కోసం ఎదురుచూస్తుంటాడు. సీతారామంలో దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. ప్రియురాలు ఆచూకీ కోసం పృథ్వీరాజ్ దేశం మొత్తం తిరుగుతూంటాడు. ఇప్పుడీ.. ఈ పోలికను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.