బింబిసార OTT రిలీజ్ ఎప్పుడంటే ?

ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. కొత్త సినిమా థియేటర్స్ కు వచ్చినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ? ఏ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్నా.. బింబిసార ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి నిర్మాత దిల్ రాజు షాకింగ్ న్యూస్ చెప్పారు. 50 రోజుల తర్వాతే బింబిసార ఓటీటీలోకి వస్తుందని స్పష్టం చేశారు.

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన రెండు సినిమాలు బింబిసార, సీతారామం బ్లాక్ బస్టర్ కావడంతో సినీ పరిశ్రమలో ఆనందం కనిపిస్తుంది. ఆదివారంతో బింబిసార బ్రేక్ ఈవెక్ కావడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సక్సెస్‌ను పురస్కరించుకొని బింబిసార టీమ్‌కు నైజాం డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్‌రాజు సక్సెస్ పార్టీని కూడా ఇచ్చారు. అంతేకాదు.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 50 రోజుల తర్వాతే బింబిసార ఓటీటీలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక సీతారామం కలెక్షన్స్ ఆదివారం నాటికి రూ. 25 కోట్లు క్రాస్ అయ్యాయి.