మహేష్ బర్త్ డే .. బోలేడు బహుమతులు !

సూపర్ స్టార్ మహేష్ బాబు 47వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహేష్ బర్త్ డే కానుకగా ‘పోకిరి’ రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 200 పైగా థియేటర్స్ లో పోకిరి స్పెషల్ షోస్ పడ్డాయి. హౌస్ ఫుల్ తో కళకళలాడుతున్నాయి. మరోవైపు సినీ ప్రముఖులు అభిమానుల నుంచి మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా మహేష్ ను విష్ చేశారు. “ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ” అంటూ చిరు రాసుకొచ్చారు. ఓ అవార్డు ఫంక్షన్ లో మహేష్ తో ముచ్చటిస్తున్న ఫోటోను షేర్ చేశారు. విక్టరీ వెంకటే మహేష్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు సంబంధించిన బ్లాక్ బస్టర్ పోస్టర్ ను షేర్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ హీరోలు, హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరు ప్రిన్స్ ను విష్ చేశారు.

ఇక అభిమానుల హంగామా మామూలుగా లేదు. మహేష్ కు సంబంధించిన రేర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. శుభాకాంక్షలు తెలియస్తునారు. ఇక అన్నీ టీవీ చానెళ్లు మహేశ్ జపం చేస్తున్నాయి. ఏ టీవీ ఛానల్ పెట్టిన మహేష్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ప్రసారం అవుతున్నాయి. మొత్తానికి.. ఈరోజు మహేష్ డే. ఆయన అభిమానులకు పండగే. అటు థియేటర్స్, ఇటు టీవీ ఛానెల్స్ లో ఆఖరికి సోషల్ మీడియాలో కూడా మహేష్ జపమే. జాతీయ వెబ్ సైట్స్, చానల్స్ కూడా మహేష్ బర్త్ డే కానుకగా స్పెషల్ కథనాలు రాయడం. ప్రసారం చేయడం విశేషం.
ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు
మహేష్ బాబు.
ఆ భగవంతుడు అతనికి మరింత
శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻
Wishing @urstrulyMahesh a happy birthday. 💐🎂 pic.twitter.com/7fDFnDDtwi— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2022
Happy birthday dearest @urstrulyMahesh!
Wishing you love and laughter this year Chinnoda ❤️ pic.twitter.com/jPcmyazO8v— Venkatesh Daggubati (@VenkyMama) August 9, 2022