‘జైలర్’ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు నుంచి అంటే ?

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ‘జైలర్’ తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 లేదా 22 నుంచి షురూ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ నే తెలిపారు.

సోమవారం రజనీ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సూపర్ స్టార్ ‘జైలర్’ రెగ్యులర్ షూట్ అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 15 లేదా 22 నుంచి షురూ చేయబోతున్నామని తెలిపారు. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుందని తెలుస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్య రాయ్, ప్రియాంక మోహన్, రమ్యకృష్ణ, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించనున్నారు.