పూజా హెగ్డే సర్కస్ చూశారా ?

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే న్యూ యార్క్ లో సర్కస్ చేసుకుంటోంది. సర్కస్ చేసుకోవాల్సిన కర్మ పూజకు ఎందుకు పట్టింది అనుకుంటున్నారా ? పట్టలేదు. కానీ ఇది కూడా సినిమా షూటింగ్ కు సంబంధించిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రమిది. డిసెంబర్ 23న ‘సర్కస్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ న్యూ యార్క్ లో జరుగుతోంది. అక్కడ పూజా హెగ్డే తో సర్కస్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. వైట్ టాప్, వైట్ లాగు ధరించి.. బుట్టబొమ్మ సర్కస్ చేస్తూ కనిపించింది. ఇది సర్కస్ అని చెప్పడం కన్నా.. సర్కస్ లో ఓ పాట చిత్రీకరణగా కనిపిస్తోంది. మూడ్నాలుగు పోజుల్లో పూజా అందంగా కనిపిస్తోంది. చెవి రింగులు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ కు జంటగా పూజా నటిస్తున్న కభీ ఈద్ కభీ దీపావళీ సినిమా కూడా శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
