బ్లూ డ్రెస్ లో తాప్సీ.. ఫ్రంట్ & బ్యాక్ అందాలు
సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను బాలీవుడ్ లో దూసుకుపోతున్నది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాప్సీ పన్ను, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘దోబారా’. 2018లో విడుదలైన స్పానిష్ సినిమా ‘మిరాజ్’కి రీమేక్ ఇది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ మిస్టరీ డ్రామా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది తాప్సీ. సోమవారం బ్లూ లవ్ చూపించింది. బ్లూ కలర్ పాయింట్, బ్లూ కలర్ జాకెట్ తో.. ట్రెండ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఫ్రంట్ & బ్లాక్ లుక్ లో అందాలు ఆరబోసింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. మీరెందుకు ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొనడం లేదు ? మీకు ఆహ్వానం లభించలేదా ? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘నా సెక్స్ లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు’. అందుకే కాఫీ విత్ కరణ్ షో లో కనిపించడం లేదని బోల్డ్ గా సమాధానం ఇచ్చింది సొట్టబుగ్గల సుందరి. ఇక తాప్సీ సొంత బ్యానర్ ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’ లో ‘Dhak Dhak’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.