అందుకే.. ప్రమోషన్స్‌కి చెప్పులేసుకొని వచ్చా !

పూరీ జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌ల్‌లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా సినిమా లైగర్. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్‌.. నత్తితో ఇబ్బందిపడే యువకుడిగా కనిపించనున్నారు. అనన్యా పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఆగస్టు 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిరోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు విజయ్. ప్రమోషన్స్ కు చెప్పులేసుకొని వెళ్తున్నాడు. దీనిపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో బాలీవుడ్ లో విజయ్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి.. పిచ్చెక్కిపోతున్నారు.

ప్రమోషన్స్ కి చెప్పులు వేసుకొని వెళ్లడంపై విజయ్ స్పందించారు. నేను చెప్పులేసుకుని ప్రమోషన్స్‌లో పాల్గొనడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా. నిజానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసమే తాను చెప్పులేసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాని ప్రేక్షకులందరికీ చేరువ చేయడానికి ఇంకా రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. ప్రతి రోజూ ఒక డ్రెస్‌, దానికి నప్పే షూల కోసం వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ చెప్పులు కొనుగోలు చేశా. దీని వల్ల నా డ్రెస్సింగ్‌కి ఎక్కువ సమయం పట్టడం లేదని వివరించారు.

thats my man @thedeverakonda👑#vijaydeverakonda #liger pic.twitter.com/azZUqBVK2B— wannabe (@wannabereg) August 9, 2022