బిహార్ సీఎంగా నీతీష్.. ఎనిమిదోసారి !
బిహార్ ముఖ్యమంత్రిగా జేడీ(యు) అధినేత నీతీశ్ కుమార్ ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీతో బ్రేకప్ చేసుకున్న నితీష్.. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 8 పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేశారు. బుధవారం సీఎంగా నితీష్ కుమార్ తో పాటు… ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. “2024 లోక్సభ ఎన్నికల విషయంలో బీజేపీ ఆందోళన చెందుతోందన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తాను కోరుకుంటున్నా. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ గెలిచారనీ.. కానీ 2024లో ఆ పార్టీకి ఉండే అవకాశాలపై ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీని వీడాలని తమ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని నీతీశ్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం బాగానే నడుస్తుందన్నారు. ఇక తేజస్వీ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇదంతా బిహార్ ప్రజల మంచికోసమేనని.. అందరూ సంతోషంగా ఉన్నారని తేజస్వీ తల్లి, బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి అన్నారు.