RC15 షూటింగ్ కు బ్రేక్.. ఎందుకంటే ?

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా (#RC15) ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్. థమన్ సంగీతం. దిల్ రాజు నిర్మాత. ఇప్పుడీ.. ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందట. ఎందుకంటే ? ఇండియన్ 2 సినిమా తిరిగి ప్రారంభించనున్న కారణంగా తాత్కాలికంగా ఈ సినిమా నిలిపివేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో చరణ్ లుక్ రివీల్ అయింది. ఇటీవల రామ్ చరణ్ పర్సనల్ స్టైలిష్ అలీమ్ హకీమ్ చిన్న గ్లింప్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చరణ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ లో మెగాస్టార్ చిరంజీవి లుక్ ను తలపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం అధికారి, సిటీజన్ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. సిటిజన్ టైటిల్ దాదాపు ఫైనల్ అయినట్టేనని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.