విక్రమ్ ‘కోబ్రా’ ఆగస్టు 31న రిలీజ్

 కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తాజా చిత్రం ‘కోబ్రా’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. వాస్తవానికి ఈ నెల 11న కోబ్రా ప్రేక్షకుల ముందుకు రావాలి. కొన్ని కారణాల వలన వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్ రిలీజ్ విషయంలో చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఈ సినిమాలో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించడంతో పాటు దాదాపు 20 రకాల విభిన్న గెటప్పులతో సందడి చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇర్ఫాన్ ఖాన్, రోషన్ అండ్రూస్, మృణాళిని రవి, కేఎస్. రవికుమార్, పద్మ ప్రియ, మియా జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సెవన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్ రిలీజ్ విషయంలో చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.