వైరల్ : 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతం.. 2 నిమిషాల ‘ఇండియాకా ఉడాన్‌’ వీడియోలో !

 

బ్రిటిష్‌ వాళ్ల నుంచి స్వాతంత్య్రం సాధించిన భారత్ 75 ఏళ్లు పూర్తి చేసుకొంది. ఈ 75 ఏళ్ల కాలంలో మన దేశం అనేక మైలురాళ్లను అధిగమించింది. హరిత విప్లవం.. అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపడం మొదలు.. క్రికెట్‌ ప్రపంచకప్‌ను ముద్దాడడం వరకు అనేక ఘనతలు సాధించింది.

ఒకప్పుడు టెక్నాలజీయే పరిచయం లేని దేశం.. నేడు డిజిటల్‌ చెల్లింపుల్లో అగ్రగామిగా నిలిచింది. ఇలా చెప్పుకొంటూ పోతుంటే భారత్‌ సాధించిన విజయాలెన్నో. వీటన్నింటికీ ఓ వీడియో రూపం ఇచ్చింది గూగుల్‌. 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ‘ఇండియాకా ఉడాన్‌’ పేరుతో దీన్ని విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#indiakiudaan pic.twitter.com/dP0g1G1eIx— OTTRelease (@ott_release) August 10, 2022