లైగర్ ప్రమోషన్ షెడ్యూల్.. ఇదే !

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో లైగర్ టీమ్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన విజయ్ అండ్ టీమ్ కు  గ్రేట్‌ తాలీ రుచి చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోను విజయ్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో విజయ్ మూందు  20 వరకూ ఉన్న డిషెస్‌.. వాటన్నింటినీ ఆవురావురుమంటూ తినేద్దామా అన్నట్లుగా విజయ్‌ చూస్తున్నాడు.

 ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న లైగర్‌ టీమ్‌ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తుందో చెబుతూ ఓ షెడ్యూల్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ నెల 23 వరకూ ఈ ప్రమోషనల్‌ టూర్‌ ఉండనుంది. 11న పుణె, 12న చండీగఢ్, 13న చెన్నై, 14న వరంగల్‌, 15న హైదరాబాద్, 17న ఇండోర్‌, 18న కొచ్చి, 19న బెంగళూరు, 20న గుంటూరు, 21, 22లలో ఢిల్లీ, 23న వారణాసిలో లైగర్‌ టీమ్‌ మూవీని ప్రమోట్‌ చేయనున్నారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్‌.. నత్తితో ఇబ్బందిపడే యువకుడిగా కనిపించనున్నారు. అనన్యా పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు.