వైట్ గౌను లో మాళవిక.. స్టన్నింగ్ లుక్స్

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ మరోసారి కెమెరా ముందుకొచ్చింది. ఈ సారి వైట్ & వైట్ లో రెచ్చిపోయింది. అతిలోక సుందరిలా ముస్తాబై మస్తగా పోజులు కొట్టింది. మాళవిక పర్ ఫెక్ట్ ఫిగర్. గ్లామర్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని కొలతలు ఆమె సొంతం. హీరోయిన్ గా ఇంకా స్టార్ డమ్ సొంతం చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్.. చ్అంతకుమించి. బాలీవుడ్ లో దిశా పటానీ మాదిరిగా సౌత్ లో నాన్ స్టాప్ గా అందాలు ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. కెమెరా ముందుకొచ్చిన ప్రతిసారి ఫ్రెష్ గా కనిపిస్తుంటుంది.

చేసిన ఏడు సినిమాలతో నాలుగు బాషలను కవర్ చేసింది. మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ బాషల్లో నటించింది. విజయ్, దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. సీనియర్ సూపర్ స్టార్స్ స్టార్ రజనీకాంత్, మమ్ముట్టి సినిమాల్లో నటించింది.ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘యుద్ర’లో నటిస్తుంది.