‘జల్సా’ రీ-రిలీజ్ డిమాండ్

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా ‘పోకిరి’ రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 200 పైగా థియేటర్స్ లో పోకిరి స్పెషల్ షోస్ పడ్డాయి. హౌస్ ఫుల్ తో కళకళలాడాయి. మహేష్ కొత్త సినిమా రిలీజ్ అయినంత హడావుడి హైదరాబాద్ లో కనిపించింది. నగరంలో దాదాపు అన్ని ప్రధాన థియేటర్స్ లో పోకిరి స్పెషల్ షోస్ పడ్డాయి. అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పోకిరి రీ రిలీజ్ మానియా చూసిన పవర్ స్టార్ పవ కళ్యాన్ అభిమానులు ఓ డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. #SanjaySahuIsBack, #SanjaySahuArrivingSoon అంటూ యాష్ ట్యాగ్ లు వైరల్ చేస్తున్నారు. జల్సా రిలీజ్ రిలీజ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఈ సందర్బంగా జల్సా చిత్రాన్ని రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు.. అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఖుషి చేయాలని ఆశపడుతున్నారు. మరీ.. వారి కోరిక తీరుతుందో లేదో చూడాలి. 

#JalsaSpecialShows #Jalsa4K #SanjaySahuArrivingSoon @PawanKalyan @s_janasena pic.twitter.com/911DjNY9U7— OTTRelease (@ott_release) August 10, 2022