‘పుష్ప 2’ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్

‘పుష్ప’ సృష్టించిన ప్రభంజన గురించి తెలిసిందే. సినిమాలోని ప్రతి మాట, పాట, ఆట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్దిరోజులుగా సుకుమార్ & టీమ్ స్కిప్టు పనులతో బిజీగా గడిపారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్క్రిప్ట్ పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. మ్యూజిక్ సిట్టింగ్స్ యూరప్ లో షురూ చేశారు. సుకుమార్-దేవిశ్రీ-చంద్రబోస్ కలిసి దిగిన సెల్ఫీ పిక్ ఒకటి షేర్ చేశారు.

 ‘పుష్ప’ పాటలు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ‘పుష్ప: ది రూల్‌’ పాటలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వీటికి తగ్గట్లుగానే పార్ట్‌-2 పాటల కోసం సుకుమార్‌ ఆధ్వర్యంలో దేవిశ్రీ ప్రసాద్‌ – చంద్రబోస్‌ బృందం గట్టి కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రెండు పాటలకు సంబంధించిన ట్యూన్స్‌ సిద్ధమయ్యాయని, మిగితా పాటల విషయంలో యూరప్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కొనసాగుతున్నాయి.