VootSelect లో ‘శభాష్ మిథు’

భారత మహిళా క్రికెట్‌ మిథాలీరాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘శభాష్‌ మిథు’. తాప్సీ టైటిల్‌ రోల్‌ లో నటించింది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకుడు. జులై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్నతనం నుంచి క్రికెటర్‌ కావాలని మిథాలీ ఎంతగా ఆరాటపడింది.. క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంది.. మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం కోసం ఆమె ఎంతలా శ్రమించింది.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ సినిమాలో చూపించారు.

మంచి సినిమా అనిపించుకున్నా.. కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. ఇప్పుడీ.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. అతి త్వరలో #VootSelect లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ బాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ స్పోర్ట్స్ డ్రామాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌ ఈ సినిమాని నిర్మించింది.

#ShabaashMithu Coming Soon on @VootSelect in #Hindi, #Tamil, #Telugu & #Kannada. #ShabaashMithuOnVoot #MithaliRaj #TaapseePannu #ottrelease pic.twitter.com/DbfnsV6Q3B— OTTRelease (@ott_release) August 10, 2022