రేణుకగా సన్నీ లియోన్.. దిగిపోయింది.

‘జిన్నా’ సినిమాతో దసరాకు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు హీరో మంచు విష్ణు. ఈ సినిమాతో ఇషాన్ సూర్య ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్నేహం,ప్రేమ అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. స‌న్నీలియోన్, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇందులో ప‌చ్చ‌ళ్ల స్వాతిగా పాయ‌ల్ క‌నిపించ‌బోతున్న‌ది. సోమవారం ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రేణుక పాత్రలో సన్నీని పరిచయం చేశారు.

పింక్ స్కర్ట్, వైట్ జాకెట్ దానిపై కోటు.. సన్ గ్లాసెస్ తో అప్పుడే బస్సు దిగుతూ స్టైలిష్ లుక్ లో రేణుక దర్శనమిచ్చింది. ఇక సినిమా షూటింగ్ సమయంలో  ఇద్దరు హాట్ బ్యూటీలు సన్నీ, పాయల్ రాజ్ పుత్ లతో కలిసి మంచు విష్ణు చేసిన చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలను ఇలాంటి చిలిపి పనులు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.