లవ్వుల లంగాలో తమన్నా
టాలీవుడ్, కోలీవుడ్.. బాలీవుడ్ అనే తేడానే లేదు. అన్ని చోట్లా తమన్నానే కనిపిస్తోంది. ఇటీవల ఫిల్మ్ కార్పోరేషన్, అమెజాన్ ప్రైమ్ కోసం అనుపమ చోప్రా నిర్వహించిన ఇంటర్వ్యూలో తమన్నా పాల్గొంది. బాలీవుడ్ హీరోయిన్స్ విద్యా బాలన్, భూమి పడ్నేకర్ తదితరులతో కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా అనుమప అడిన ప్రశ్నలకు ఎంతో కాన్ఫిడెన్స్ గా ఆన్సర్ చెప్పింది. పింక్ కలర్ జాకెట్, ఎల్లో కలర్ లంగాలో.. దానికి లవ్ సింబల్ హోల్స్ తో కలర్ ఫుల్ గా కనిపించింది.
15 ఏళ్లకే పని మొదలు పెట్టింది తమన్నా. ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ (2005) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘శ్రీ’ సినిమాతో తెలుగు తెరకు, ‘కేడి’ సినిమాతో తమిళ తెరకు పరిచయం అయింది. దాదాపు 17 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. మధ్య మధ్యలో బాలీవుడ్ సినిమాలు చేసింది. అయితే ఎప్పుడూ డౌన్ అయింది లేదు. పైగా ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తూ అవకాశాలు సొంతం చేసుకుంటుంది. స్టైల్ విషయంలో కూడా అంతే. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో ఆకట్టుకుంటోంది.