గ్లోబల్ స్టార్.. యాడ్ పర్ఫెక్ట్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సరికొత్త యాడ్ లో కనిపించింది. ఈ సారి నిండైన దుస్తుల్లో #gloriavanderbiltjeans ను ప్రమోట్ చేసింది. ఈ షూట్ లో భాగంగా బ్లూ జీన్స్ దానిపై వైట్ షర్ట్ వేసుకొని దర్శనమిచ్చింది. మరో ఫోటోలో బ్లూ జీన్స్ యాష్ కలర్ టీ షర్ట్ తో పర్ఫెక్ట్ ఫిట్ గా కనిపించింది. ఆ ఫోటోలకి పింకీ క్యాప్షన్ కూడా అదే ఇచ్చింది.

ఫరాన్ అక్తర్ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా-కత్రినా కైఫ్-అలియా భట్ కలిసి నటించనున్న రోడ్ ట్రిప్ ఫిల్మ్ ‘జీ లే జరా’ షూటింగ్ వచ్చే ఏడాది షురూ కానుంది. ఈ సినిమాలో యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వాస్తవానికి ఈ ఏడాదియే ఈ సినిమా షూటింగ్ షురూ కావాల్సి ఉంది. అయితే ముగ్గురు స్టార్ హీరోయిన్స్ డేట్స్ ఒకేసారి అడ్జెస్ట్ కావడం లేదని తెలుస్తోంది.  

#ad The perfect fit. #gloriavanderbiltjeans #madeformyneeds pic.twitter.com/ISDLunFoeu— PRIYANKA (@priyankachopra) August 9, 2022