వకీల్ సాబ్ గా అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నల్లకోటు వేసుకోబోతున్నాడు. వకీల్ సాబ్ గా రాబోతున్నాడు. ‘జాలీ ఎల్ఎల్బీ 3’ 2023లో పట్టాలెక్కనుంది. దీన్ని స్టార్ స్టూడియోస్ నిర్మిస్తుండగా.. సుభాష్కపూర్ తెరకెక్కించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.
‘జాలీ ఎల్ఎల్బీ’ వరుసలో ఇది మూడో ఫ్రాంచైజీ చిత్రం. ‘కోర్టు రూం ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా మొదటి రెండు భాగాలకు మించి నవ్వులు పంచుతుంది. ఇప్పటికే స్క్రిప్టువర్క్ పూర్తైంది. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ మొదలవుతుంది. నవంబరులో విడుదల చేయాలనుకుంటున్నామని మేకర్స్ ప్రకటించారు. ఇక రాఖీ పండగ కానుకగా రిలీజైన అక్షయ్ కుమార్ ఫ్యామిలీ డ్రామా రక్షాబంధన్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది.