#SSMB28 : మహేష్ లుక్ ఇదే

అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో మరో సినిమా (#SSMB28) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హారిక‌,హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో మ‌హేష్‌బాబు లుక్, మేనరిజమ్స్ ఎలా ఉంటాయోనని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి తన కొత్త స్టిల్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చారు మ‌హేష్‌బాబు.

సోమ‌వారం విడుద‌ల చేసిన మ‌హేష్‌బాబు న్యూ లుక్ ఫొటో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో లైట్ గా గ‌డ్డం,మీసక‌ట్టుతో స్టైలిష్‌గా మ‌హేష్‌బాబు క‌నిపిస్తున్నారు. లవింగ్ ది న్యూ వైబ్ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు మహేష్ బాబు. ఇదే ఫోటోలు షేర్ చేసిన సంగీత దర్శకుడు థమన్ #SSMB28 మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ అంటూ ట్వీట్ చేశారు. త్రివిక్ర‌మ్ సినిమాలో మ‌హేష్ ఈ లుక్‌ల‌నే క‌నిపించ‌నున్నారంటూ క్లారిటీ ఇచ్చేశారు.

మహేష్ కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వెకేష‌న్ కోసం ఫారిన్ వెళ్లారు. లండ‌న్‌,యూర‌ప్‌తో పాటు ప‌లు దేశాల‌ను ప‌ర్య‌టించారు. ప్ర‌స్తుతం ఈ టూర్స్ ముగించుకున్న ఆయ‌న త్వ‌ర‌లోనే త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నారు. ఈ నెలాఖరులో ఈ రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.