కనగరాజ్ తో లవ్ లో రౌడీ హీరో

యూనివర్సల్ హీరో  క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విక్ర‌మ్ ఈ సినిమా ఈ ఏడాది ఇండియ‌న్ సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. విక్ర‌మ్ స‌క్సెస్ త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్‌తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్‌, కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కులు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇప్పుడీ.. ఈ జాబితాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేరారు.

చెన్నైలో జ‌రిగిన లైగ‌ర్ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. విక్ర‌మ్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌పై ప్ర‌శంస‌ల్ని కురిపించారు. క‌న‌క‌రాజ్ సినిమాల‌కు తాను వీరాభిమానిని. అత‌డి సినిమాటిక్ యూనివ‌ర్స్ లో ఏదో ఒక రోజు భాగం అవుతాన‌నే న‌మ్మ‌క‌ముంద‌న్నాడు. లోకేష్ క‌న‌క‌రాజ్ తో పాటు తమిళంలో పా రంజిత్‌, వెట్రిమార‌న్ సినిమాలంటే ఇష్టమని రౌడీ హీరో చెప్పారు. లైగ‌ర్ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అనన్య పాండే హీరోయిన్. మైక్ టైసన్ గెస్ట్ రోల్ కనిపించబోతున్నారు.